ఇంధన కొరత.. 4 రోజులే వర్కింగ్ డేస్
ఇంధన కొరత నేపథ్యంలో శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దేశంలో ఇప్పటి వరకు ఐదు రోజుల పనిదినాలను ప్రస్తుతం 4 రోజులకు కుదించింది. ప్రతి బుధవారం సెలవు ఇచ్చేందుకు నిర్ణయించింది. MAR 18 నుంచి ఇది అమలులోకి రానుంది. ప్రైవేటు సంస్థలు కూడా దీన్ని పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. వైద్యం, ఓడరేవులు, నీటి సరఫరా, కస్టమ్స్ విభాగాలు వంటి ముఖ్యమైన సేవలు అన్ని రోజులు అందుబాటులో ఉండనున్నాయి.