ఇరాన్‌పై ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌పై ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, నేవీని నాశనం చేశామని వెల్లడించారు. తమతో చర్చలకు సిద్ధమని ఇరాన్ అంటోందని పేర్కొన్నారు. కానీ ఇప్పటికే ఆలస్యమైందని అన్నారు. ఇరాన్ నేవీ హెడ్ క్వార్టర్స్‌ను కూడా భారీగా దెబ్బతీశామన్నారు. మిగిలిన నౌకలు కూడా త్వరలోనే సముద్ర గర్భానికి చేరుకుంటాయని హెచ్చరించారు.