వారికి ఉచిత ప్రయాణం అవాస్తవం: TGSRTC

వారికి ఉచిత ప్రయాణం అవాస్తవం: TGSRTC

TG: రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణంపై TGSRTC యాజమాన్యం స్పష్టత ఇచ్చింది. దివ్యాంగులందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్త అవాస్తవమని పేర్కొంది. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసి ప్రజలను తప్పదోవ పట్టిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించింది.