ఈనెల 10న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

ఈనెల 10న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

VSP: ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల 10న విశాఖలో జరగనున్నాయి. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతాయని జెడ్పీ ఛైర్మన్‌ సుభద్ర తెలిపారు. ఈ సమావేశాలు జెడ్పీ ఛాంబర్ సమీపంలోని వీ.సీ.హాలులో, జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు.