రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య
SKLM: నరసన్నపేట మండలం కంబకాయ గ్రామానికి చెందిన కొత్తపల్లి జ్యోతి (33) అనే వివాహిత మంగళవారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.