ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం

ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం ప్రభుత్వ పాఠశాలలో  క్షుద్రపూజల కలకలం రేపింది. బాలికల మూత్రశాలలో గుర్తుతెలియని దుండగులు పసుపు ,కుంకుమ వేసి నిమ్మకాలు పెట్టి వారినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. స్థానిక ఆకతాయులే ఈ పని చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.