రఘునాధపురం పాఠశాలకు సౌండ్ సిస్టం అందజేత
BHNG: రాజాపేట మండలంలోని రఘునాధపురం ప్రాథమిక పాఠశాలకు రూ. 26 వేల విలువ గల సౌండ్ సిస్టంను శనివారం యాదగిరిగుట్ట మండలం చిన్న గౌరాయపల్లి సర్పంచ్ బోగ లక్ష్మీనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ చందా రమేశ్, గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ మాట్లాడుతూ.. పాఠశాలకు మైక్ సిస్టం అందజేసిన దాతకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.