కాలనీ అభివృద్ధికి సహకరిస్తా: ఛైర్మన్
HNK: వికాస్ నగర్‌లో పద్మావతి గోదా సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి నూతన దేవాలయ ప్రతిష్ఠ, అభయాంజనేయస్వామి పునః ప్రతిష్ట వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు. వికాస్ నగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, కాలనీ అభివృద్ధికి సహకరిస్తానని ఆయన చెప్పారు.