ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి సన్మానం
NZB: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా (క్యాబినెట్ హోదా) నియమితులైన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని మున్సిపల్ నాయకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. మున్సిపల్ కౌన్సిలర్ తుము శరత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. సుదర్శన్ రెడ్డికి కీలక పదవి లభించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు.