గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
RR: ఎల్బీనగర్ PS పరిధి మన్సూరాబాద్ చిన్నచెరువులో ఆదివారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.