ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

KMR: నరసాపూర్‌లో అధికారులు ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.