ఈ నెల 12న మోడల్ స్కూల్లో ప్రవేశపరీక్ష
AKP: మునగపాక మండలం పాటిపల్లి మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు ఈనెల 12వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు పరీక్ష స్థానిక మోడల్ స్కూల్లో ప్రారంభం అవుతుందన్నారు. విద్యార్థులు హాల్ టికెట్స్‌తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను తీసుకురావాలన్నారు.