'ఉన్న సిటీని పట్టించుకోని వారు.. ఫ్యూచర్ సిటీ కడతారా?'
RR: ఇబ్రహీంపట్నంలో జరిగిన సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఫార్మాసిటీకి 14 వేల ఎకరాలు సేకరిస్తే, అప్పట్లో రైతులకు భూములు తిరిగి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, అదే భూముల్లో “ఫ్యూచర్ సిటీ” చేపడుతుందన్నారు. ఉన్న సిటీని పట్టించుకోని వారు ఫ్యూచర్ సిటీ కడతారా.? అని ప్రశ్నించారు.