స్పెషల్ లోక్ అదాలత్.. 163 క్రిమినల్ కేసులు పరిష్కారం
RR: షాద్ నగర్ కోర్టు కాంప్లెక్స్‌లో నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ స్వాతి రెడ్డి, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో కక్షిదారులు పాల్గొని వివిధ క్రిమినల్ కేసులలో రాజీ కుదుర్చుకున్నారని, మొత్తం 163 క్రిమినల్ కేసులు పరిష్కరించబడ్డాయన్నారు.