విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్

కృష్ణా: విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని మోదుమూడి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల శతాబ్ది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ పాఠశాల శతాబ్ది వేడుకలు నిర్వహించుకోవడం శుభ పరిణామం అన్నారు.