'ప్రణాళిక కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలి'
SRCL: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పై జిల్లా కలెక్టరేట్ సముదాయంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.