'రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి'
KDP: వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. ఎర్రగుంట పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో మంగళవారం రాత్రి ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. వాహనాలను నడిపే వ్యక్తులు రోడ్డు భద్రతతో పాటు పార్కింగ్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.