నేడు ఒంటిమిట్ట పవిత్రోత్సవాలకు అంకురార్పణ

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయ పవిత్రోత్సవాలకు నేడు అంకురార్పణ నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటలకు ఉత్సవ మూర్తులను ప్రత్యేక అలంకరణ చేసి, ఆలయంలోని రంగ మండపంలో ఆసీనులు చేస్తారు. అనంతరం పండితులు పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు.