'సృజనాత్మకతను వెలికి తీసేందుకే సమ్మర్ క్యాంపులు'

'సృజనాత్మకతను వెలికి తీసేందుకే సమ్మర్ క్యాంపులు'

ADB: విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందని దండేపల్లి మండలంలోని వెల్గనూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి పేర్కొన్నారు. శనివారం వెల్గనూర్ పాఠశాలలో ఏర్పాటుచేసిన వేసవి శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. వాలంటీర్లు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత వెలికి తీస్తూ ఆటపాటలతో బోధన చేయాలన్నారు.