'ఉద్యమకారులను ఒకే విడతలో ఎంపిక చేయాలి'

'ఉద్యమకారులను ఒకే విడతలో ఎంపిక చేయాలి'

KNR: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సమావేశం బుధవారం కరీంనగర్లో నిర్వహించారు. కేకే కమిటీని ప్రభుత్వం వేసిన కమిటీగా భావించలేమని రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ తెలిపారు. ఉద్యమకారులను విడతల వారీగా కాకుండా అమరవీరుల కుటుంబాలు, దివ్యాంగులు, జైలు వెళ్లిన వారు, కేసులు ఎదుర్కొన్న వారిని ఏకకాలంలో గుర్తించాలని, విధివిధానాలు మార్చకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.