'అఖండ 2' నుంచి బిగ్ అప్‌డేట్
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అఖండ 2'. కార్తీక పౌర్ణమి సందర్భంగా మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఓ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. 'తాండవం' ఫస్ట్ సింగిల్ ప్రోమో ఈ నెల 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఓ చిన్న వీడియోను విడుదల చేశారు. కాగా, ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది.