జిల్లాలో 3.11 లక్షల మహిళలకు ఇందిరమ్మ చీరలు: కలెక్టర్

జిల్లాలో 3.11 లక్షల మహిళలకు ఇందిరమ్మ చీరలు: కలెక్టర్

KMR: జిల్లాలో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ పండుగ వాతావరణంలో జరగాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. 18 ఏళ్లు పైబడిన 3,11,922 మంది మహిళలు చీరలకు అర్హులని తెలిపారు. వివాదాలకు తావు లేకుండా ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, దీని కోసం ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించామని బుధవారం కలెక్టర్ పేర్కొన్నారు.