'బతుకమ్మ కానుకగా మహిళలకు రెండు చీరలు'

SDPT: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాల్లో ఉన్న 60 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ. 1600 విలువగల రెండు చీరలను బతుకమ్మ కానుకగా ఈ సంవత్సరం నుంచి అందించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మార్క అనిల్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డల పట్ల చూపిస్తున్న ప్రేమకు, ఆత్మగౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు.