కుట్టు శిక్షణా కేంద్రాలను సందర్శించిన బీసీ కార్పొరేషన్ ఈడి

కుట్టు శిక్షణా కేంద్రాలను సందర్శించిన బీసీ కార్పొరేషన్ ఈడి

ప్రకాశం: పామూరులో మహిళలకు కుట్టు శిక్షణను అందిస్తున్న కేంద్రాలను బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. కుట్టు శిక్షణను నేర్చుకొని మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను మహిళలకు అందజేసేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఆయన వెంట ఎంపీడీవో బ్రహ్మయ్య, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.