సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

KNR: శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామంలో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణం కొరకు మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గోపగోని బస్వయ్య గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం కొబ్బరికాయలు కొట్టి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెపు అజయ్, గ్రామశాఖ అధ్యక్షులు వెంకటేశం, నాయకులు, కార్య కర్తలు, పాల్గొన్నారు.