రెసిడెన్షియల్ స్కూల్లో కలెక్టర్ తనిఖీలు

యాదాద్రి: భువనగిరిలో మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల భోజనంలో కూరగాయలు తక్కువగా ఉన్నాయని వార్డెన్ చెప్పడంతో, కలెక్టర్ వెంటనే కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి నాణ్యమైన కూరగాయలు సరఫరా చేయాలని ఆదేశించారు. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.