పన్నులు వసూలు చేసిన డిప్యూటీ ఎంపీడీవో

పన్నులు వసూలు చేసిన డిప్యూటీ ఎంపీడీవో

VZM: రాజాం డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు బొద్దాంలో సోమవారం సాయంత్రం పన్నులను వసూలు చేపట్టారు. గ్రామస్థులు పనులు ముగించుకొని సాయంత్రం ఇళ్లకు చేరుకునే సమయంలో పన్నులు వసూలుపై ఆవగాహన కల్పించారు. ఆన్లైన్‌ పేమెంట్‌ చేయాలని తెలియని వారు సచివాలయ కార్యదర్శని అడిగి తెలుసుకోవాలని సూచించారు. పన్నులను సకాలంలో చెల్లించాలన్నారు.