పాఠశాల సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
కడపలోని ముత్తరాసుపల్లె ప్రాథమిక పాఠశాలను ఇవాళ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్న భోజనం సరిగా లేకపోవడం, అలాగే విద్యార్థినుల టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలను పీ-4 మోడల్‌గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.