రంజీ విజేత జమ్మూకాశ్మీర్‌పై మోదీ ప్రశంసలు
చారిత్రాత్మక రంజీ ట్రోఫీ విజయం సాధించిన జమ్మూకాశ్మీర్ క్రికెట్ జట్టును ప్రధాని మోదీ అభినందించారు. ఈ అద్భుత విజయం పట్ల భారత్ గర్విస్తోందని పేర్కొన్నారు. ఇది జమ్మూకాశ్మీర్‌లో క్రీడల పట్ల సానుకూల ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. ఈ గెలుపు క్రీడల్లో రాణించాలనుకునే ఎంతోమంది యువతకు గొప్ప స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఈ మేరకు 'మన్ కీ బాత్' వేదికగా ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.