పారిశుద్ధ్యం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

పారిశుద్ధ్యం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

AKP: గ్రామాల్లో పారిశుద్ధ్యం-పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డీప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ సూచించారు. ఇవాళ ఉదయం పాయకరావుపేట మండలం వెంకటనగరంలో ఉపాధి హామీ వేతనదారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తే సమాధానం ఇవ్వాలన్నారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. చెత్తను క్లాప్ మిత్రలకు అందజేయాలన్నారు.