అగ్రికల్చర్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

BDK: మణుగూరు MLA క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అగ్రికల్చర్ అధికారులతో రానున్న వర్షాకాలానికి రైతులకు అందించే సేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ముందుగానే విత్తనాలు,ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. అలాగే ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని కోరారు.