ఎన్నికల నిర్వహణపై సమీక్ష: ఎంపీడీవో
MHBD: తొర్రూరు మండలంలోని 31 గ్రామపంచాయతీ సర్పంచులు, 756 వార్డు సభ్యుల ఎన్నికలపై స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. నామినేషన్ల విత్ డ్రాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎన్నికల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.