విధులకు గైర్హాజరు.. 17 మంది సస్పెండ్

విధులకు గైర్హాజరు.. 17 మంది సస్పెండ్

VKB: పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 17 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.