కొండెక్కిన నిమ్మ ధరలు.. కిలో ఎంతంటే..?
NLR: గూడూరు నిమ్మ మార్కెట్లో నిమ్మకాయకల ధరలు కొండేక్కి కూర్చున్నాయి. కిలో నిమ్మ కాయలు గతంలో ఎప్పుడు లేని విధంగా కిలో రూ.150 నుంచి రూ.180 వరకూ ధర పలికింది. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, నిమ్మకాపు గణనీయంగా తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని అంటుంతున్నాయి. దీంతో తోటల్లో నిమ్మ కాపు ఉన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.