జగన్నాధపురంలో రోడ్డు ప్రమాదం

NTR: వీరులపాడు మండలం జగన్నాధపురం మూలమలుపు వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరువూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు కంచికచర్ల వైపు నుంచి ఎర్రుపాలెం వెళ్తున్న లారీని వేగంగా ఢీకొన్నది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువకుడు గాయాలపాలయ్యాడు. ప్రమాదం తరువాత కారు పక్కనే ఉన్న కాలువలోకి వెళ్ళింది. ఈ ప్రమాద సంఘటనపై మరింత సమాచారం తెలియాలి.