ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు

NLG: దేవరకొండలో సూర్య ప్రతాపానికి ప్రజలు తల్లడిల్లి పోతున్నారు. ఆదివారం అంగడి రోజు అయినప్పటికీ ఎండ వేడి వల్ల జన సంచారం పూర్తిగా తగ్గిపోయింది. ఎండ 43 డిగ్రీల పైన ఉండడంతో వేడి, ఉక్కపోతకు ప్రజలు తట్టుకోలేక ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. దీంతో ప్రధాన రహదారుల వెంట జన సంచారం లేక వీధి వ్యాపారులకు, దుకాణదారులకు, వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని తెలిపారు.