ఈనెల 17 నుంచి సర్వికల్ కేన్సర్ అవేర్నెస్

VZM: జిల్లాలో సర్వికల్ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈనెల 17 నుంచి 2 వారాల పాటు నిర్వహించబోతున్నామని DMHO జీవనరాణి గురువారం తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, మహిళా శిశు సంక్షేమ కేంద్రాల్లో స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు.