డ్రైనేజీ సమస్యపై రోడ్డుపై ధర్నాచేసిన కాలనీవాసులు
RR: బడంగ్ పేట్ చౌరస్తాలో సోమవారం AGR కాలనీవాసులు డ్రైనేజీ సమస్య గురించి రోడ్డుపై బైఠాయించారు. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాల వల్ల అక్కడక్కడ డ్రైనేజీ సాఫీగా సాగక ఇళ్లాలోని నీరు రావడం జరుగుతుందని ఆరోపించారు. మున్సిపాలిటీకి సమస్య గురించి విన్నవించినా పట్టించుకోకపోవడం వల్ల ధర్నాకు దిగినట్లు స్పష్టం చేశారు.