పిల్లలను బయటకు పంపొద్దు: డీఈవో

పిల్లలను బయటకు పంపొద్దు: డీఈవో

MDK:  హవేలిఘన్‌పూర్ మండలం కూచన్‌పల్లి పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో డీఈవో విజయ పాల్గొన్నారు. వేసవి సెలవుల్లో ఎండల తీవ్రత దృష్ట్యా పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్త వహించాలని తల్లిదండ్రులకు సూచించారు. సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా ఇంట్లోనే చదువుకునేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మధు మోహన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.