నగరానికి దగ్గర దారి.. గుంతల మయంగా మారి.!

నగరానికి దగ్గర దారి.. గుంతల మయంగా మారి.!

KDP: చెన్నూరు మండల కేంద్రం నుంచి రామనపల్లె, రాచి న్నాయపల్లె గ్రామాల మీదుగా కడప నగరానికి వెళ్లే సమీప దారి గుంతలమయంగా మారడంతో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం ద్వారా కడప రాజంపేట బైపాస్ మార్గం కూడా రాకపోకలు సాగిస్తుంటారు. దేవుని కడపకు కూడా ఎక్కువమంది రాకపోకలు సాగిస్తుంటారు.