వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కణ
విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శనివారం ఆయన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న నియోజకవర్గాల్లో జరిగే ర్యాలీలకు అన్ని పార్టీలను, ప్రజా సంస్థలను కలుపుకుని పాల్గొనాలని సూచించారు. ఈ మేరకు వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కణ చేశారు.