వెయిట్ లిఫ్టింగ్ సంగం కోశాధికారిగా ఆకుల నాగరాజు
NZB: తెలంగాణ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ సంఘం ఆదివారం నగరంలోని టీఎన్జీవోస్ భవనంలో జిల్లా వెయిట్ లిఫ్టింగ్ సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లా వెయిట్ లిఫ్టింగ్ సంఘం కోశాధికారిగా ఆకుల నాగరాజుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా, ఆకుల నాగరాజు సుదీర్ఘకాలం పాటు వ్యాయామ ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్నారు. వీరి ఎంపిక పట్ల జిల్లా PET సంఘాలు అభినందనలు తెలిపాయి.