పద్మాక్షి దేవస్థానంలో ఘనంగా అక్షయ తృతీయ వేడుకలు
HNK: శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవస్థానంలో అక్షయ తృతీయ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి రూ.25,000 నూతన నాణేలు, సువర్ణ పుష్పాలతో కనకాభిషేకం నిర్వహించారు. అక్షయ తృతీయ అంటే తరిగిపోనిదని, ఈ రోజు చేసే దానధర్మాలు అక్షయ ఫలితాలనిస్తాయని పండితులు తెలిపారు. బంగారం కొనడం కంటే శక్తి కొలది దానాలు చేయడం ఉత్తమమని, అభిషేకం చేసిన నాణేలను భక్తులకు ప్రసాదంగా అందజేస్తామని పేర్కొన్నారు.