విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

PDPL: ఎన్టీపీసీ టౌన్ షిప్లో విద్యార్థులకు స్పాట్ చిత్ర లేఖనం పోటీలను ఆదివారం నిర్వహించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత పరిధిలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రామగుండం ఎన్టీపీసీ(ఓఅండం) జీఎం మనీష్ అగర్వాల్ హాజరై పోటీలను ప్రారంభించారు. విద్యార్థులను నాలుగు గ్రూపులుగా విభజించి పోటీలు పెట్టారు.