మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
వనపర్తి జిల్లా ఏదుల గ్రామానికి చెందిన ఎర్రమొని వెంకటమ్మ (45) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల దగ్గర దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో ముదిరాజుల సంఘం సభ్యులకు సహాయం చేయాలని తెలిపారు. గ్రామానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడంతో వారంతా స్పందించి దాదాపు రూ. 34 వేలు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.