యువతకు ఎస్సై ఉపేందర్‌రావు సూచనలు
MLG: పతిపల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ములుగు ఎస్సై ఉపేందర్‌రావు యువతకు కీలక సూచనలు చేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని సూచించారు. పోటీ పరీక్షలకు క్రమశిక్షణతో సిద్ధమైతే విజయం సాధించవచ్చని తెలిపారు. యువతలో స్పూర్తి నింపుతూ అవగాహన కల్పించారు.