మద్దికేరలో కౌలు రైతు ఆత్మహత్య

మద్దికేరలో కౌలు రైతు ఆత్మహత్య

KRNL: కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మద్దికేరలో గురువారం చోటుచేసుకుంది. సాయినగర్‌కు చెందిన తాసిలి హనుమంతు(50) తన స్వగృహంలో ఉరి వేసుకున్నారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. దాదాపు రూ. 10 లక్షల మేర అప్పులు ఉన్నాయని భార్య తెలిపింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.