పోలీసులకు సీపీఆర్‌పై అవగాహన

పోలీసులకు సీపీఆర్‌పై అవగాహన

SKLM: ఎచ్చెర్లలోని ఆర్మ్డ్ రిజర్వ్ ఫారెస్ట్ కార్యాలయంలో ప్రథమ చికిత్స అయిన సీపీఆర్ విధానంపై కానిస్టేబుళ్లకు అవగాహన కల్పించారు. DSP శేషాద్రి శుక్రవారం ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ప్రథమ చికిత్సపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలని కాపాడుకోవచ్చు అని డీఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.