'మహిళా సంఘం ఆధ్వర్యంలో సూచిక బోర్డు ఏర్పాటు'
KMR: నాగిరెడ్డిపేట మండలం కన్నారెడ్డి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఊరు పేరును సూచించే బోర్డును గ్రామ గేటు ఏర్పాటు చేశారు. చాలా రోజులుగా తమ గేటు వద్ద ఊరు పేరును సూచించే బోర్డు లేకపోవడం వల్ల బస్సులో వెళ్లే ప్రయాణికులకు రహదారిపై వెళ్లేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఐకేపీ సీసీ కొమ్మ దత్తు సూచనతో మహిళలందరూ గ్రామ సూచిక బోర్డును గురువారం ఏర్పాటు చేసుకున్నారు.