మతిస్థిమితం లేని వృద్ధురాలి సూసైడ్

NLR: నాయుడుపేట మండలం కాపులూరు గ్రామానికి చెందిన సన్నారెడ్డి వెంకటమ్మ(78)కు మతిస్థిమితం సరిగా లేక 8వ తేదీ ఇంట్లో పొలాలకు వాడే గడ్డి మందులు సేవించి అపస్మారస్థితిలోకి వెళ్లింది. ఆమెను జిల్లాలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్సలు అందిస్తుండగా మృతి చెందింది. మృతురాలి కుమారుడు జనార్దన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.